News

ఏబీవీపీ కార్యకర్తలకు బెయిల్ మంజూరు

568views
  • సీఎం స్టాలిన్ వైఖ‌రిపై ఏబీవీపీ మండిపాటు

తమిళనాడు: ఏబీవీపీ కార్యకర్తలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లావ‌ణ్య ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా సీఎం స్టాలిన్ నివాసం ముందు నిరసన తెలిపినందుకు 32 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మంగళవారం (ఫిబ్రవరి 22) జైలు నుండి విడుదలయ్యారు. అయితే, ఎగ్మోర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సోమవారం సాయంత్రం వారికి బెయిల్ మంజూరు చేశారు. కాగా, స్టాలిన్ ప్ర‌భుత్వం మ‌మ్మ‌ల్ని ల‌క్ష్యంగా చేసుకుంద‌ని ప‌లువురు కార్య‌క‌ర్త‌లు విమ‌ర్శించారు. కాగా, చెన్నైలో సాయంత్రం జరిగిన ఒక సమావేశంలో తల్లిదండ్రులు ఏబీవీపీ పాత్రను అభినందించారు. ప్రభుత్వ ప్రతీకార, బెదిరింపు వైఖరిని అడ్డుకోవాల‌ని, న్యాయం కోసం భవిష్యత్తులో మరిన్ని నిరసనలలో పాల్గొనాలని కోరారు.

నిధి త్రిపాఠి, ముత్తు రామలింగం, హరి కృష్ణ, ఆశిష్ చౌహాన్ మాట్లాడుతూ, “మాపై సెక్షన్ 353 ఐపీసీని బ‌నాయించి, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన‌ట్టు తప్పుడు అభియోగాలు మోపారు… మా నిరసన పూర్తిగా శాంతియుతంగా జ‌రిగింది. డీఎంకే ప్రభుత్వం పగతో వ్యవహరిస్తూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటోంది… శాంతియుత నిరసనలో పాల్గొన్నందుకు మాపై తప్పుడు కేసులు పెట్టింది… చర్య తీసుకోవాలంటూ గొంతు పెంచుతున్న విద్యార్థి కార్యకర్తలను జైలుకు పంపింది… డీఎంకే ప్రభుత్వంపై పోరాటానికి మేం సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఎక్కడా సీఎం నివాసం ఎదుట నిర‌స‌న తెలిపిన విద్యార్థులను 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపలేదన్నారు.

సీఎం స్టాలిన్ అహంభావం, నిరంకుశ ఆలోచనలు, అధికార దుర్వినియోగం, మైనారిటీ బుజ్జగింపు విధానం వల్లే విద్యార్థులను అక్రమంగా రిమాండ్‌కు తరలించారని, ఇదే మొదటిది, చివరిది అని సమావేశంలో కేడర్‌ అన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి