
595views
భాగ్యనగరం: ముచ్చింతల్‌లో రామానుజ చార్యుల సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు ఘనంగా ముగిశాయి. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు సోమవారం ముగియటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు.
వేడుకల్లో చివరిరోజైన సోమవారం స్వర్ణ రామానుజాచార్యుల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహణతో పాటూ, శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞ మహాపూర్ణాహుతీ కార్యక్రమాలు ప్రముఖ ఘట్టాలుగా నిలిచాయి. చినజీయర్ స్వామి తమ శిష్యగణంతో పాటూ, వందలమంది ఋత్వికులూ, వేల సం ఖ్యలో భక్తులూ హాజరైన పక్షంలో పవిత్రమైన ఆ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.
Source: Nijamtoday





