
536views
న్యూఢిల్లీ: పుల్వామా అమరులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. వారు చేసిన త్యాగాలు దేశ ప్రగతి కోసం కృషి చేసేలా ప్రజలను ఆలోచింపజేస్తాయన్నారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 2019లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్ 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్లోని బాలాకోట్ ఉగ్ర స్థావరంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది.





