News

పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

531views

శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన వాహననౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజయవంతమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి దీన్ని చేపట్టారు. మూడు ఉపగ్రహాలతో పాటు ఈవోఎస్‌-04, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ- సీ52 రోదసిలోకి మోసుకెళ్లింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి