News

హిమపాతంలో చిక్కుకున్న మహిళను కాపాడిన భద్రతా బలగాలు

493views

న్యూఢిల్లీ: భారత సైన్యం మరోసారి ధైర్యసాహసాలను ప్రదర్శించింది. హిమపాతంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఫజలీ బేగం అనే మహిళను కాపాడింది భారత సైన్యం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళను బందీపూర్ జిల్లా బరౌబ్ ప్రాంతం నుంచి స్ట్రెచర్​పై హెలిప్యాడ్ వద్దకు తరలించారు.

సుమారు 1.5 కిలోమీటర్లు ఐదు అడుగుల మంచులోనే ప్రాణాలకు తెగించి మహిళను హెలిప్యాడ్ వద్దకు చేర్చారు. అక్కడినుంచి బందిపోరా జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చినార్ కార్ప్స్​ ఆర్మీ బృందం ట్వీట్ చేసింది. ప్రస్తుతం శ్రీనగర్​లో ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయికి చేరినట్టు వాతావరణ శాఖ అధికారు తెలిపారు. అత్యల్పంగా మైనస్​ 8.1 డిగ్రీలుగా నమోదు అయ్యాయని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి