News

బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ అధికారిని కాల్చి చంపిన మావోలు

422views

బీజాపూర్‌: ఛత్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్​ కమాండెంట్​ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్‌కేల్ గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

డొంగల్ చింతా నది సమీపంలోని అటవీ ప్రాంతంలో రహదారి భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్ సిబ్బంది పైకి మావోయిస్టులు కాల్పులకు పాల్పడినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరగ్గా, కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ శాంతి భూషణ్ టిర్కీ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. అప్పారావు అనే జవాన్‌ గాయపడినట్టు వెల్లడించారు. క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి