News

అరేబియా తీరంలో భారత నౌకాదళం తనిఖీలు

598views
  • పాక్ నుంచి ర‌వాణా అవుతున్న మాదక ద్రవ్యాలు స్వాధీనం

న్యూఢిల్లీ: దేశ పశ్చిమ తీరంలో 763 కిలోల మాదక ద్రవ్యాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్​లో రూ.2000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ముందస్తు సమాచారంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, నేవీ జాయింట్ ఆపరేషన్​లో ఈ మేరకు డ్రగ్స్​ను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్నవాటిలో 529 కిలోల నాణ్యమైన గంజాయి, 234 కిలోల క్రిస్టల్ మెథాంఫేటమిన్, హెరాయిన్ ఉన్నట్టు ఎన్సీబీ తెలిపింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​ బ్యాగులను పోరుబందర్ తీరానికి అధికారులు తీసుకువచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి