
515views
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అల్‌బదర్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సంయుక్తంగా బందీపొరాలో గాలింపు చేపట్టాయి. గాలింపు బృందాలపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. దీంతో ఓ పోలీసు మృతిచెందగా, పలువురు పౌరులు గాయపడ్డారు.
Source: namasthe telangana





