News

ప్రధాని… మీకు తోడుగా మేమున్నామంటున్న భారత ప్రజలు

364views
  • పీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు

  • ప్రతిపక్షాల ఆరోపణలను లక్ష్యపెట్టని ప్రజలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రారంభించిన పీఎం కేర్స్ నిధులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగి రూ.10,990 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఫండ్​ నుంచి మొత్తం రూ.3,976 కోట్లు వివిధ కార్యక్రమాల నిమిత్తం జారీ అయ్యాయి. ఇందులో రూ.వెయ్యి కోట్లు వలస కార్మికుల సంక్షేమం కోసం, రూ.1,392 కోట్లు కొవిడ్ టీకా డోసుల కోసం కేటాయించారు. పీఎం కేర్స్ నిధులకు సంబంధించి తాజా ఆడిట్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రతిపక్షాల అనవసర ఆరోపణలను లెక్కచేయకుండా ప్రజలు ఈ విరాళాలు అందించారు.

5 రోజుల్లో వేల కోట్లు జమ

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.494.91 కోట్లు విదేశాల నుంచి వచ్చాయని నివేదికలో తేలింది. రూ.7,183 కోట్లు స్వచ్ఛంద విరాళాల రూపంలో వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీఎం కేర్స్​కు రూ.3076.62 కోట్ల విరాళాలు అందాయి. ఇవన్నీ ఐదు రోజుల వ్యవధిలోనే రావడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి