News

దేశంలో అతిపెద్ద హనుమంతుడి విగ్రహం శ్రీకాకుళంలో ఏర్పాటు

673views
  • ప్రారంభించిన పరిపూర్ణానందస్వామి

శ్రీ‌కాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద దేశంలోనే ఎత్తైన 180 అడుగుల వీర హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వంశధార నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తోంది.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పరిపూర్ణానంద స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రామ్ మాధవ్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి