News

లతా మంగేష్కర్ మృతి పట్ల మోహన్ భాగవత్ సంతాపం

366views

నాగ్‌పూర్: ప‌్ర‌ముఖ గాయ‌ని లతా మంగేష్కర్ మృతికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ ఆదివారం సంతాపం తెలిపారు. “లతా మంగేష్కర్ మృతితో యావత్ దేశ ప్రజలు పడుతున్న బాధను మాటల్లో వర్ణించడం కష్టం. ఈ లోటును భరించే ఓపికను ఆమె కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నా తరపున, సంఘ్ తరపున ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను..” అని స‌ర్ సంఘ‌చాల‌క్ అన్నారు.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్(92) ఈ రోజు కన్నుమూసిన విష‌యం విదిత‌మే. ఆమెకు కొవిడ్‌-19, న్యుమోనియా ఉన్నట్టు నిర్ధారణ అయిన తర్వాత కిందిటి నెల ఎనిమిదోతేదీన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.

ఆమె కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ, శనివారం ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో మంగేష్కర్‌కు వెంటిలేటర్ సపోర్ట్‌ను అందించారు. ఈరోజు ఉదయం 8.12 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి