
అరియలూరు(తమిళనాడు): అరియలూరు విద్యార్థిని లావణ్యను ఆమె చదువుతున్న స్కూలు యాజమాన్యం క్రైస్తవ మతమార్పిడికి నిర్బంధించినందువల్లే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో నిందితులను కాపాడేందుకు డీఎంకే ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరచిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు.
లావణ్య మృతిని తమ పార్టీ రాజకీయ కోణంలో చూడలేదని ఆమె స్పష్టం చేసారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకు తమ బృందం ఇటీవల లావణ్య కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించినట్టు ఆమె తెలిపారు.
వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుని కలెక్టర్, ఏడీఎస్పీలను కలిసి సీబీఐ దర్యాప్తుకు సహకరించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. లావణ్య కుటుంబం డీఎంకే పార్టీకి చెందినదని, అయినప్పటికీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకే బీజేపీ ఈ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుందని విజయశాంతి చెప్పారు.
Source: Nijamtoday





