News

పాయకరావుపేటలో కామ పాస్టర్‌!

959views
  • దేవుడి సేవంటూ మహిళలపై అత్యాచారాలు

  • రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 30 మంది బాధితులు

  • పోలీసులకు ఫిర్యాదు అందడంతో ‘ప్రేమదాస్‌’ గుట్టు రట్టు

పాయకరావుపేట: విశాఖపట్నం జిల్లాలో ఓ పాస్టర్‌ దేవుడి సేవంటూ కామ పాస్టర్‌గా తయారయ్యాడు. ప్రార్థనలకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ పాస్టర్‌ బాధితులు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 30 మంది వరకు ఉన్నారు. సేవ పేరిట సొంత పనులకు ఉపయోగించుకోవడమే కాకుండా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాధితులంతా ఒకేసారి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళడంతో అసలు సంగతి బయటకు పొక్కింది. అనాథలకు ఆశ్రయం ఇస్తున్నానంటూ ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలివి.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం, గణపవరం గ్రామానికి చెందిన 25 ఏళ్ళ యువతి బీటెక్‌ పూర్తి చేసి, హైదరాబాద్‌లో 2018లో ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరింది. ఓ రోజు చర్చికి వెళ్ళిన సమయంలో పాయకరావు పేటకు చెందిన ప్రేమ స్వరూపిణి మినిస్ట్రీస్‌ నిర్వాహకుడు అంబటి అనిల్‌కుమార్‌ అలియాస్‌ ప్రేమ దాస్‌ రచించిన కొన్ని పుస్తకాలు కనిపించాయి.

దాంతో ఆ యువతి పుస్తకం వెనుక ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయగా ప్రేమదాస్‌ మాట్లాడారు. తనకు కొన్ని పుస్తకాలు కావాలని అడగ్గా కనీసం వంద పుస్తకాల అయితేనే పంపిస్తామని చెప్పాడు. ఆర్డర్‌ ఇవ్వగా 200 పుస్తకాలు పంపించాడు. ఆ తర్వాత కూడా అడక్కుండానే ప్రేమదాస్‌ భారీగా పుస్తకాలు పంపించేవాడు.

దేవుడి సేవంటూ…

ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన మినిస్ట్రీస్‌కు రావాలని.. దేవుడికి సేవ చేసుకునే అదృష్టం ఉంటుందని, ఆ యువతికి ఆశ కల్పించాడు. బస్‌ టిక్కెట్‌ కూడా ఆయనే బుక్‌ చేసేయడంతో ఆ యువతి పాయకరావుపేటకు వెళ్ళింది. అయితే, అప్పటికే ఆ మినిస్ట్రీలో కనీసం 30 మంది యువతీయువకులు ఉన్నారు. అయితే, నెలకు జీతం ఇస్తామని.. ఇది కూడా సేవ వంటిదేనని నమ్మించడంతో ఆ యువతి నమ్మింది. అప్పటి నుంచి ఆయన ఆ యువతితో చేయకూడని పనులన్నీ చేయించాడు. ఆ మినిస్ట్రీలో వీరముల్లు రాజేశ్వరి అలియాస్‌ లిల్లీ అలియాస్‌ బేబీ అనే మహిళ అక్కడి వ్యవహారాలన్నీ చూసేది. వారిద్దరూ భార్యాభర్తలుగా మెలిగేవారు. అయితే, ఇదే అదనుగా పాస్టర్‌ ప్రేమదాస్‌ ఈ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. సినిమాలు చూపించి, తాను హీరోనని హీరోయిన్‌గా అన్ని పనులు చేయాలని ఆ యువతిని కొట్టేవాడు. అందుకు రాజేశ్వరి కూడా పరోక్షంగా సహకరించేది. ఫోన్‌లో పోర్న్‌ వీడియోలు చూపించి, అలా నటించమనేవాడు. ప్రశ్నిస్తే తనలో ఉన్న మాంత్రికుడే అలా చేయిస్తున్నాడని చెప్పేవాడు. ఇంకా గట్టిగా అడిగితే బెదిరించేవాడు.

వాట్సాప్‌లో ఆశ్లీల చిత్రాలు

ప్రేమదాస్‌ ఆ యువతికి వాట్సాప్‌లో ఆశ్లీల చిత్రాలు పంపమనేవాడు. సెక్స్‌ పాఠాలు చెప్పేవాడు. నిలువునా మోసపోయిన ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెబుదామన్నా ఫోన్‌లు అందకుండా చేసేవారు. కొద్ది రోజుల తర్వాత రాజేశ్వరి తమ్ముడు ప్రసాద్‌తో ఈమెను బలవంతపు పెళ్ళి చేశారు. అయినా, పాస్టర్‌ లీలలు కొనసాగుతునే ఉండేవి. తల్లి ఆరోగ్యం బాగులేదని బ్రతిమాలగా అప్పుడు ప్రసాద్‌తో తన సొంతూరు పంపించారు.

అయితే, తల్లిదండ్రులు బాధపడతారని పాస్టర్‌ విషయం చెప్పలేదు. తర్వాత కొద్ది రోజులకు తనలాగే మోసపోయిన ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలుసుకుని, ఆమె పాయకరావుపేట వచ్చి, ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Source: Leader

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి