
భాగ్యనగరం: నిషేధిత మావోయిస్టు పార్టీ చెర్ల ఎల్‌జిఎస్ గ్రూపునకు చెందిన 19 ఏళ్ల మహిళ మంగళవారం తెలంగాణ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఎదుట తిరుగుబాటు సంస్థపై ఆరోపణలు చేస్తూ లొంగిపోయింది. తనను ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడుతోపాటు 2-3 దళాల సభ్యులతో వివాహం చేసుకోమని మావోయిస్టు పార్టీ బలవంతం చేసిందని బాధితురాలు ఆరోపించింది.
తెలంగాణలోని చెర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన వెట్టి జోగి అలియాస్ జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 141 బెటాలియన్ ఎదుట లొంగిపోయింది. వెట్టి జోగిని 15 ఏళ్ళ వయస్సులో మావోయిస్టు పార్టీ 2018లో బలవంతంగా చేర్చుకుంది.
”మావోయిస్ట్ పార్టీ నాయకులు ఆదివాసీ పిల్లలను బడికి వెళ్లనివ్వడం లేదు. ఈ ఆదివాసీ బాలికలను, బాలురను బెదిరించి మావోయిస్టు పార్టీలో చేరమని బలవంతం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ నాయకులు బాలురు, బాలికల హక్కులను ఉల్లంఘిస్తున్నారు.” అని పోలీసులు ఓ ప్రకటన పేర్కొన్నారు.
Source: Organiser