News

హిందువుల పాలిట రాక్షసుడు ‘మహమ్మద్‌ రహీష్‌ ఇసూఫ్‌’

1.1kviews
  • న్యూజిలాండ్‌లో దుర్ఘటన

క్రైస్ట్‌చర్చ్‌: ఫీజీలో జన్మించి, న్యూజిలాండ్‌, క్రైస్ట్‌చర్చ్‌లో నివాసముంటున్న 63 ఏళ్ళ మహమ్మద్‌ రహీష్‌ ఇసూఫ్‌ హిందువుల పాలిట రాక్షసుడిగా మారాడు. ముగ్గురు పెద్దవారిని, ఇద్దరు చిన్న పిల్లలను హత్య చేసేందుకు ప్రయత్నించగా, నలుగురు చనిపోయారు. 11 నెలల చిన్నారి మిగిలింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అంతా హిందువులే.

వడ్రంగి నిర్మల్‌ కుమార్‌, భార్య ఉషా దేవి, వారి కుమార్తె నీలేష్ని కాజల్‌, ఆమె ఇద్దరు కుమార్తెలు 11 ఏళ్ళ సనా, ఎనిమిదేళ్ళ సమరలకు ఇసూఫ్‌ విషం తాగించాడు. అయితే, నలుగురు మృతి చెందగా, 11 ఏళ్ళ సనా బతికింది. ఈ సంఘటన ఓ కొండపై జరిగింది. కొండపై తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్న స్థానిక రైతు పొరపాటు ఈ మృతదేహాలపై పడిపోయాడు. నలుగురు వ్యక్తులు చనిపోయి పడి ఉన్న దృశ్యం… సమీపంలో 11 నెలల అమ్మాయి పాకుతూ ఆ రైతుకు కనిపించింది. దీంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.

నిర్మల్‌కు నిందితుడు ఇసూఫ్‌ చాలా ఏళ్ళ నుంచి తెలుసు. ఫిజీ నుంచి కొన్నేళ్ళ కింద న్యూజిలాండ్‌ వచ్చాడు. తాను ధనవంతుడని నమ్మించాడు. అయితే, ఇసూఫ్‌ నిజానికి న్యూజిలాండ్‌లో కేవలం బస్సు డ్రైవర్‌.

ఇదిలావుండగా, బాధితుల్లో ఒకరి చేతిలో లేబుల్‌ లేని కోలా ఖాళీ సీసా ఉంది. విషపూరితమైన పదార్థాన్ని తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని మొదట పోలీసులు భావించారు. లోతుగా దర్యాప్తు చేసి, హత్యగా కేసుగా నమోదు చేశారు. 2019 ఆగస్టులో ఐదుగురు సభ్యుల హిందూ కుటుంబాన్ని ఇసూఫ్‌ చంపేశాడని తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి