
3views
మన సమాజంలో ఏదైనా జరగాలంటే పురుషులు, మహిళలు పరస్పరం కలిస్తేనే సాధ్యమవుతుందని, వస్తుత: ఇదే లక్షణం మన సంప్రదాయంలో వుందని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కానీ.. ప్రచారం ఎలా చేస్తున్నారంటే.. ఆధిపత్యం అన్న ధోరణితో నడిచిందని, గుడ్డిగా కొందరు దీనిని స్వీకరించారని అన్నారు. ఇలాంటి అసంపూర్ణమైన విషయాలను స్వీకరించి, వాటి పునాదులపై అసంపూర్ణ వ్యవస్థలను నిర్మిస్తున్నామని, వాటి ద్వారా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, అందుకే మనకు సమాధానాలు లభించడం లేదని వివరించారు. హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఆదివారం ‘‘యుగానుకూల మాతృత్వం’’ అనే అంశంపై విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో ఓ సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరై, మాతృమూర్తులకు మార్గదర్శనం చేశారు.
అలాగే స్త్రీ విముక్తి అన్న పదాన్ని కూడా తెరపైకి తెచ్చారని అన్నారు. అయితే.. స్త్రీ విముక్తి అన్న పదం వినడానికి చాలా బాగుందని, అయితే.. ఒక వేళ దాస్యం అనే భావమే వుంటే.. కచ్చితంగా దాని నుంచి స్త్రీ విముక్తం చెందాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే.. ఎవరైనా బంధనాల్లోనే వున్నారన్నారు. ఆ బంధనాలను తెంచడం కుదరని పని అన్నారు. ప్రతి విముక్తి కూడా ఓ కొంత బంధనానికి దారి తీస్తుందన్నారు. నేను బంధవిముక్తుడ్ని అయ్యాను.. బంధనాల్లో లేను అని ప్రకటిస్తే సరిపోదన్నారు. దేనినైతే మనం బంధనాల పాశమని అనుకుంటామో.. అది వాస్తవానికి ముక్తి అనే బంధనం అని అన్నారు.
దేశంలో స్త్రీ విముక్తి ఉద్యమం ప్రారంభమైందని, దానిని కొందరు స్వీకరించారన్నారు. అలాగే జెన్ జీ కూడా వచ్చిందని, వినడానికి ఆ పదం బాగుంటుందన్నారు. భావోద్వేగంతో కూడుకున్నదై వుంటుందని, అనుకరించడానికి కూడా అదే విధంగా వుంటుందని, పరిపక్వతతో ఆలోచించరన్నారు. ఇదే క్రమంలో ఓ జెన్ జీ ‘‘స్త్రీ విముక్తి’ అంటూ విషపు ఆలోచనలు నాటే ఓ పుస్తకం రాశారని, దాంతో రెండు తరాలు విచ్ఛిన్నం అయ్యాయన్నారు. తర్వాత కొన్ని రోజులకు ఆమె తన తప్పును తెలుసుకొని, మళ్లీ దానికి కౌంటర్ గా మరో పుస్తకం రాసిందని, అందులో తన తప్పును అంగీకరించిందన్నారు. కనీసంలో కనీసం రాబోయే తరాలు తప్పుడు మార్గంలో వెళ్లకుండా మరి కొన్ని పుస్తకాలు రాసుకొచ్చిందన్నారు. చివరికి మాతృత్వమే మహిళకు అత్యంత శ్రేష్ఠం అని అంగీకరించారని పేర్కొన్నారు. కానీ.. గుడ్డిగా ఆ పాశ్చాత్య ధోరణిని మనం కూడా అనుసరించామని, అదే ప్రగతిశీలమని అనుకొని, మనం కూడా గుడ్డివాళ్లుగా అనుసరిస్తామన్నారు. అందుకే ప్రస్తుత తరుణంలో ‘‘మాతృత్వం’’ గురించి చర్చించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.
అన్ని పరిస్థితుల వెనుక దృష్టికోణమే వుందని, ఆ దృష్టి కోణాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోవాలని మోహన్ భాగవత్ సూచించారు. భారత్ దగ్గర సంపూర్ణమైన, సమగ్రమైన దృష్టికోణం ఎప్పటి నుంచో వుందని, ఎందుకంటే సృష్టికి సంబంధించిన సత్యాన్ని మన పూర్వజులు బాగా అధ్యయనం చేశారని, దానిని స్వీకరించి, భవిష్యత్ తరాలకు అందించారన్నారు. ఆ వారసత్వమే ఇప్పటికీ మన దగ్గర వున్నాయన్నారు. అందరమూ ఒక్కటేనన్న భావనను ఆ వారసత్వం అందిస్తోందని తెలిపారు.
పురుషులు, మహిళలు, ప్రాణులు, మనుషులు, జడత్వం, చేతనత్వం… ఇవన్నీ భ్రమలేనని, అయితే.. వీటిని దాటి పోలేమన్నారు. ఇవన్నీ మాయలే అయినా.. తపస్సు ద్వారా వాటిని దాటాలన్నారు. అయితే ప్రకృతి సహకారం ద్వారా, అనుమతి ద్వారా ఈ మాయను ఛేదించగలుగుతామన్నారు. కానీ వాస్తవం ఏమంటే.. అందరూ ఒక్కటేనన్న భావనే మన వారసత్వం. అయితే.. ఈ చైతన్యం అనేది కొంత మట్టుకే పరిమితం కాదని,విశ్వవ్యాప్తమని సైన్స్ కూడా చెబుతోందని గుర్తు చేశారు.





