News

ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

605views

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 22 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో తెలిపారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఈవో తెలిపారు. కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలోలాగా ముందస్తు రిజర్వేషన్‌ ఉంటుందన్నారు. దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10వ తేదీలోగా దేవస్థానం కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత వచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి