
311views
ఝార్ఖండ్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గిరిధ్ జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని వంతెనను పేల్చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక బారాగద గ్రామంలోని బరాకర్ నదిపై ఉన్న బ్రిడ్జ్ ను పేల్చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో కొన్ని కరపత్రాలు లభ్యమయ్యాయి.
అంతకుముందు రెండు సెల్ టవర్లను నక్సలైట్లు ధ్వంసం చేశారు. మావోయిస్టు టాప్ కమాండర్ ప్రశాంత్ బోస్, అతని భార్య శీలా మరాండీని గతేడాది నవంబర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ చర్యకు నిరసనగా జనవరి 21 నుంచి ‘రెసిస్టెన్స్ వీక్’ను మావోయిస్టులు నిర్వహిస్తున్నారని.. అందులో భాగంగానే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.