
584views
రాంబన్: గోమాతల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జమ్మూకశ్మీర్ పరిధి, రాంబన్ జిల్లాలో నిత్యం పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. దీనిని అడ్డుకునే నిమిత్తం రాంబన్, చందర్‌కోట, బటోటే ప్రాంతాల పోలీసు బృందాలు ఏకమై తమ తమ పరిధిలో పటిష్ఠమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేశాయి. ఎప్పటిలాగే వాహనాలు తనిఖీ చేయగా కశ్మీర్ వెళ్ళే మొత్తం 13 వాహనాల్లో 54 పశువులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. దీంతో పోలీసులు ఆ వాహనాలను సీజ్ చేశారు. 54 పశువులను రక్షించారు. నిందితులపై కేసులు పెట్టారు.
Source: Organiser





