
-
ఇంటెలిజెన్స్ హెచ్చరిక
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీఅత్యంత రహస్యంగా ప్రభుత్వంకు అందజేసిన్నట్టు చెబుతున్నారు.
భారత 75వ గణతంత్ర దినోత్సవాలకు హాజరయ్యే ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల ప్రాణాకు ముప్పు ఉందని ఆ నివేదికలో ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈసారి మధ్య ఆసియా దేశాలైన – కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ -నాయకులను గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది.
కాగా, పాకిస్థాన్/ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉండొచ్చన్న సమాచారం వచ్చిందని ఆ నోట్ లో ఇంటెలిసెన్స్ పేర్కొంది. ఈ విచ్చిన్నకర శక్తులు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను టార్గెట్గా చేసుకుని.. బహిరంగ సభలు, కీలకమైన సమావేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో పేలుళ్లు, విధ్వంసానిక పాల్పడడం వంటి చర్యలకు ఉపక్రమించే ప్రమాదం ఉందని ఆ నివేదికలో వెల్లడించారు.
Source: Nijamtoday





