
572views
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధ మండప దర్శనాలను రద్దు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా.. దళారుల బెడదను నియంత్రించేందుకు కూడా ఈ చర్యలు ఉపకరిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
భక్తులకు తీర్థం పంపిణీని సైతం నిలుపుదల చేశారు. ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో ముఖ మండపం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలను కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.





