920
ఆత్మకూరు పట్టణంలో అక్రమంగా మసీదు నిర్మిస్తుండటం తో అడ్డుకున్న హిందువులపై ముస్లిం మూకలు దాడికి పాల్పడ్డాయి. హిందువులపై రాళ్లు రువ్వి.. వాహనాలను దగ్ధం చేశారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ముస్లిం మూకలు అడ్డుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు.. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఆత్మకూరు పట్టణానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు.
ఈ ఘటనకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు భాజపా పిలుపునిచ్చింది. దాడికి నిరసనగా ఆందోళన చేపట్టనుంది. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తమ నేతలపై కేసు పెట్టారని భాజపా ఆరోపించింది. కేసులను ఉపసంహరించుకోవాలన్న వారు.. అరైస్టైన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.