News

తమిళనాడులో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై జిహాదీల దాడి

945views

చెన్నై: తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన ఆర్.ఎస్.ఎస్ జిల్లా ధర్మజాగరణ్ ప్రముఖ్ రవిపై జనవరి 7వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో కొందరు జిహాదీలు దారుణంగా దాడి చేశారు. రవి బైక్‌పై వెళుతుండగా, నలుగురు జిహాదీలు అడ్డుకుని, హత్య చేయాలనే ఉద్దేశంతో ఇనుప రాడ్‌లతో అతని తలపై కొట్టారు.

తనపై జరిగిన ఆకస్మిక దాడితో రవి స్పృహతప్పి పడిపోవడంతో చనిపోయాడనుకుని దుండగులు అతనిని వదిలేసి వెళ్ళిపోయారు. స్థానికులు అతనిని తేని ప్రభుత్వాసుపత్రిలోని ఐసీయూలో చేర్పించారు.

జనవరి 2వ తేదీన కూడలూరుకు చెందిన రజాక్‌ అనే వ్యక్తి రవికి చెందిన ఒక ఖాళీ స్థలంలో మాంస వ్యర్థాలను తెచ్చి పడేశాడు. దాంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పి పంపారు.

ఆ సంఘటనను సాకుగా చూపి దుండగులు రవిపై దాడి చేశారు. నిజానికి రవికి చెందిన స్థలంలో మాంస వ్యర్థాలను పడేసిందే రవితో గొడవపెట్టుకుని, ఆ గొడవలో అనుకోకుండా జరిగిన‌ట్టుగా అతనిని చంపెయ్యాలనే ప్లానుతోనేనని జాతీయవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన వెనుక అతివాద ముస్లిం సంస్థల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుందని ఆ సంస్థ‌లు అంటున్నాయి. ఘటనపై లోతైన దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రూరమైన దాడికి వ్యతిరేకంగా సంఘ్, వివిధ క్షేత్ర కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

Source: VSKTamilanadu.org

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి