News

బసిర్‌హత్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

666views
  • ఆరుగురు అరెస్టు

బెంగాల్: కొత్త సంవత్సరం రోజున ముస్లింలు అధికంగా ఉండే బసిర్‌హత్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌లో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. బసిర్‌హత్ సబ్ డివిజన్‌లోని టాకీ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకల పిక్నిక్‌ నుండి తిరిగి వస్తున్న వ్యక్తుల సమూహంపై సాయుధ నేర‌స్తులు దాడి చేశారు. ఆ బృందంలో స్థానిక వ్యాపారవేత్తలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.

ఈ సంఘటన జనవరి 1, శనివారం రాత్రి 9 గంటలకు జరిగింది. నేర‌స్తులు బామున్‌పుకూర్ సమీపంలోని బసంతి హైవేపై రోడ్డును జామ్ చేశారు. పిక్నిక్‌ వ్యాన్‌ను ఆపి డ్రైవర్‌ను కొట్టడం ప్రారంభించారు. వారి వద్ద ఉన్న నగదు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లి పిక్నిక్‌ వ్యాన్‌ ఖాళీ చేయమన్నారు. ఆ తర్వాత మహిళా సభ్యుల్లో ఒకరిని బందీలుగా పట్టుకుని బలవంతంగా వ్యాన్‌ను హైజాక్ చేసి వెళ్లిపోయారు.

మినాఖాన్‌లోని బసంతి హైవే సమీపంలో తుపాకీతో బెదిరించి, మహిళపై సామూహిక అత్యాచారం చేసి, రోడ్డు పక్కన వదిలేశారు. దుండగులు అక్కడి నుంచి పారిపోయిన కొన్ని గంటల తర్వాత, కుమార్‌జల్ ప్రాంతంలోని నివాసితులు బాధితురాలు రోడ్డు పక్కన పడి ఉండడాన్ని గమనించారు. వారు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జనవరి 2, ఆదివారం తెల్లవారుజామున, మహిళపై దోపిడి, సామూహిక అత్యాచారంలో పాల్గొన్నందుకు సలాం సర్దార్, హబీబుర్ మొల్లా, షరీఫుల్ గాజీ, సూరజిత్ మొండల్, బకిబిల్లా తరఫ్దార్, రకీబుల్ ఇస్లాంలను అరెస్టు చేశారు. నిందితులంతా 20 ఏళ్ళ‌లోపు వారే…

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి