418
-
తాజా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతం
జమ్ము: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా ఛదూరా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారినుంచి 3 ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.