
జార్ఖండ్: చెట్లను అక్రమంగా, ఇష్టానుసారం నరుక్కుంటూ వెళుతున్న ఓ మాజీ మావోయిస్టును గ్రామస్థులందరూ కలిసి సజీవ దహనం చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సిమ్‌డేగా జిల్లాలో సాల్‌వుడ్ అటవీ చెట్లను అక్రమంగా నరికి విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ‘సంజు ప్రధాన్’ అనే మాజీ మావోయిస్టును గ్రామస్థులు కాల్చివేశారు. కొలెబిరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెస్‌రాజరాలో మంగళవారం (డిసెంబర్ 4) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్థానిక పోలీసులను, అధికారులను ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
ఛప్రిదీపాకు చెందిన ప్రధాన్ మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై గతంలో అరెస్టయ్యాడు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ప్రధాన్ కలప విక్రయించే వ్యాపారం ప్రారంభించాడు. ఖుత్‌కట్టి అటవీ భూమి నుంచి సాల్ కలపను అక్రమంగా నరికివేసినట్టు గ్రామస్థులు ఆరోపించారు. గిరిజన సంప్రదాయంలో, ఖుత్‌కట్టి అడవులు గిరిజన సమాజానికి చెందినవి. ఖుత్‌కట్టి అటవీ భూమిలో ఉన్న చెట్లను ముఖ్యంగా సాల్ వుడ్ చెట్లను గిరిజనులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. గత ఏడాది అక్టోబర్ 21న ప్రధాన్ వద్ద నుంచి భారీగా 120 సీఎఫ్‌టీ కలపను అటవీశాఖ స్వాధీనం చేసుకోవడంతో గిరిజనులు ప్రధాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కేసు కూడా నమోదైంది.
Source: NationalistHub





