
613views
-
బ్రిటిషర్లు నింపిన మట్టి తొలగిస్తున్న భారత పురావస్తు శాఖ
భువనేశ్వర్: ఒరిశాలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం (కోణార్క్) మరోసారి వార్తల్లో నిలిచింది. కోణార్క్ దేవాలయంలోని జగ్‌మోహన్ లేదా ముఖశాల ప్రాంగణంలో పూడ్చిన మట్టిని సురక్షితంగా తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. భారతదేశం పురావస్తు సర్వే చెబుతున్న దానిప్రకారం 118 సంవత్సరాల క్రితం బ్రిటీష్ పాలనలో ఈ గర్భాలయంలో ఇసుకను నింపారు. మట్టిని తొలగించే పనిని పురావస్తు శాఖ మొదలు పెట్టింది. ఈ మట్టిని బయటకు తీస్తే, 100 సంవత్సరాలకు పైగా ఇందులో కూరుకుని ఉండిపోయిన ఈ ఆలయ గర్భగుడి తెరుచుకుంటుంది.





