
536views
న్యూఢిల్లీ : తాళపత్రాల రూపంలో భగవద్గీత, వేమన, సుమతి శతకాలను రూపొందించిన గాజుల సత్యనారాయణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు పిల్లలను ఆకర్షించి వారిలో ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి సోమవారం పీఏ ఫోన్ చేసి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారని రచయిత గాజుల సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలోనే ఆయన మాట్లాడతానన్నారని వివరించారు.





