News

పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కీలక నిర్ణయం

541views
  • భారత్‌లో తీర్థయాత్రలకు ఏర్పాటు

  • మొదటి విడతగా పాక్‌లోని మందిరాలను సందర్శిస్తున్న హిందువులు

ఇస్లామాబాద్‌: భారత్, పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రతి నెలా గుళ్లు, గోపురాలకు, ప్రార్థనా స్థలాలకు తీర్థయాత్రలు నిర్వహించాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ యోచిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి ఇరు దేశాల ప్రభుత్వాలూ సహకరిస్తున్నాయని కౌన్సిల్ పేర్కొంది.

తొలి ప్రయత్నంగా, నూతన సంవత్సరంలో భారత్, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన హిందూ యాత్రికులు పాకిస్తాన్‌లోని వందేళ్ల నాటి శ్రీపరమహంస మహారాజ్ ఆలయాన్ని దర్శించుకుని పూజలు జరిపించారు. ఈ బృందంలో మొత్తం 173 మంది భక్తులు ఉన్నారు. వీరిలో అయిదారుగురు అమెరికన్లు.. కొందరు స్పెయిన్, కొందరు దుబాయి నుంచి వచ్చారు. భారతదేశం నుంచి సుమారు 160 మంది ఉన్నారు. వీరంతా పాకిస్తాన్‌లో ఉన్న హిందూ, సిక్కు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.

ఇది ఒక కొత్త ఆలోచన అని, ఈ చొరవ వల్ల 74 ఏళ్ళ తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నామని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ రమేష్ కుమార్ వక్వానీ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి