News

ముత్తులూరులో ఘ‌నంగా భారతమాత పూజ‌

814views

క‌ర్నూలు: జిల్లాలోని రుద్రవరం మండలం, ముత్తులూరు గ్రామంలో భారతమాత పూజ నగర సంకీర్తన, గోమాత పూజ ఘ‌నంగా జ‌రిగింది. ప్రధాన వక్తగా ఆర్.ఎస్‌.ఎస్ ప్రముఖ్‌ రామకృష్ణ ప్రసంగించారు. రామాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భజన బృందానికి రెండు మైక్ స్టాండ్లు , పది తాళములు, హనుమాన్ చాలీసా ఫ్లెక్సీ బోర్డు ప్ర‌దానం చేశారు. నంద్యాల ధర్మ జాగరణ ప్రముఖ్ చంద్రశేఖర్రెడ్డి, జిల్లా పరియోజన ప్రముఖ్‌ శ్రీనివాసరెడ్డి, ధర్మ జాగరణ కార్యకర్త మల్లికార్జున ఆర్థిక సాయంతో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

భజన గురువులకు ఘ‌నంగా స‌త్క‌రించారు. స్థానిక హిందూ బంధువులు, మాతృమూర్తులతోపాటు కర్నూలు విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్‌ రాంప్రసాద్, జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ చంద్రశేఖర ప్రసాద్, ఖండ ప్రముఖ్ బ్రహ్మానంద రెడ్డి, జిల్లా చెన్నకేశవ పరియోజన ప్రముఖ్‌ రామ నరసింహ, విశ్రాంత అధ్యాపకులు లింగేశ్వర రావు, జిల్లా ఆది జాంబవ జిల్లాసహ పరియోజన ప్రముఖ్ గోపి, ఆర్లగడ్డ రామదండు భజన బృందం పాల్గొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి