
689views
తిరుపతి: ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రత్యేక క్యాలెండర్‌ను ముద్రించినట్టు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 3డీ ఎఫెక్ట్, సిల్వర్ కోటింగ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన ఆరు పేజీల క్యాలెండర్‌ను తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఈవో జవహర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక్షంగా వీక్షించిన అనుభూతి కలిగేలా ఆధునిక పరిజ్ఞానంతో క్యాలెండర్ రూపకల్పన చేసినట్టు సుబ్బారెడ్డి చెప్పారు. 25 వేల క్యాలెండర్ల ముద్రించామని, ఒక్కోదాని ధర రూ. 450 అని వెల్లడించారు. తిరుమల, తిరుపతితోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ క్యాలెండర్ అందుబాటులో ఉంచామన్నారు.





