News

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బలవంతపు మత మార్పిడికి ప‌న్నాగం!

687views
  • పోలీసుల‌కు వ‌న వాసుల ఫిర్యాదు

  • వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో మొత్తం న‌లుగురు క‌ట‌క‌టాల పాలు

ఝుబువా(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): హిందువుల‌ను బ‌ల‌వంతంగా ఇత‌ర మ‌తాల్లోకి మార్పిడి చేసే ప‌న్నాగం బెడిసికొట్ట‌డ‌డంతో నిందితులు క‌ట‌క‌టాల పాల‌య్యారు. వ‌న వాసులనే లక్ష్యంగా చేసుకున్న క్రైస్త‌వ మిష‌న‌రీలు వారికి విద్య‌, వైద్యం ఉచితంగా అందిస్తామ‌ని ఎర వేస్తున్నారు. ఈ ఉచితానికి బ‌దులుగా క్రైస్త‌వం పుచ్చుకోవాల‌ని బ‌లవంతం చేస్తున్నారు. ఈ మేర‌కు 26 ఏళ్ల తేతియా బరియా అనే గిరిజనుడు కళ్యాణ్‌పురా పోలీస్ స్టేషన్‌లో(ఈ నెల 26న‌) ఫిర్యాదు చేశాడు.

క్రైస్త‌వం పుచ్చుకుంటే మిషనరీ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, విద్య ఉచితంగా అందిస్తామ‌ని ఫాదర్ జామ్ వాగ్దానం చేశాడ‌ని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. “డిసెంబర్ 26న ఉదయం ఎనిమిది గంటలకు, ఫాద‌ర్ జామ్ సింగ్ దిండోర్.. నన్ను, సూర్తి బాయి (మరొక గ్రామస్థుడు)ని వారి ప్రార్థన గదికి పిలిచి(మతమార్పిడి కోసం పిలిచే వారపు సమావేశం) మమ్మల్ని కూర్చోబెట్టారు. మాపై నీళ్లు చల్లి బైబిల్ చదివించారు’ అని తేతియా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, తాము ఆ వాగ్దానాన్ని తిర‌స్క‌రించి అక్క‌డి నుంచి వెళ్ళిపోయామ‌ని వివ‌రించారు. తరువాత పోలీసులకు సమాచారం అందించామ‌ని తేతియా తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఝబువా జిల్లాలో పాస్ట‌ర్ అన్సింగ్ నినామా, జామ్‌ సింగ్ దిండోర్‌, మంగు మెహ‌తాబ్ భూరియా అనే వ్య‌క్తుల‌ను ఎంపీ పోలీసులు అరెస్టు చేశారు.

  • బ‌ల‌వంతంగా ఇస్లాంలోకి…

ఇదే రాష్ట్రం.. అశోక్ నగర్ జిల్లాకు చెందిన మరో సంఘటనలో ఈ నెల 25న జావేద్ ఖాన్ అనే వ్య‌క్తి త‌న‌తో సంబంధం ఉన్న వనవాసి మహిళను హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మార‌మ‌ని బలవంతం చేశాడు.

జావేద్ ఖాన్ తనతో నివసిస్తున్నాడని, తనను తాను రాకేష్ కుష్వాహగా చెప్పాడ‌ని, అయితే, కొడుకు పుట్టిన తర్వాతే అతడి అసలు పేరు జావేద్ అని తనకు తెలిసిందని బాధితురాలు పోలీసుల‌కు చేసిన‌ ఫిర్యాదులో వివ‌రించింది. అప్పటి నుంచి తన విశ్వాసాన్ని మార్చుకోవాలని జావేద్ తనపై ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. నిందితుడు ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి