
506views
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారిపై పోరులో భారత్ మరింత శక్తివంతంగా మారింది. దేశంలో మరో రెండు కొత్త టీకాలతోపాటు ఓ ఔషధం అందుబాటులోకి వచ్చింది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన ‘కొవొవాక్స్’, బయోలాజికల్-ఇ సంస్థ అభివృద్ధిచేసిన ‘కార్బెవాక్స్’లతో పాటు.. మోల్నుపిరవిర్ ఔషధం అత్యవసర వినియోగానికి కూడా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ఆమోదం తెలిపింది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని వెల్లడించారు. వీటికి అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదించిన ఒక్కరోజు వ్యవధిలోనే సీడీఎస్‌సీఓ ఈ నిర్ణయం తీసుకుంది.





