News

విమానాల్లో వినిపించనున్న భారతీయ సంగీతం

331views

న్యూఢిల్లీ: దేశంలోని ఎయిర్​లైన్లు తమ విమానాల్లో భారతీయ సంగీతాన్ని వినిపించాలని పౌర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. విమానాశ్రయాలలోనూ ఇండియన్ మ్యూజిక్​ను ప్లే చేయాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాలన్నీ.. తమ సంస్కృతిని ప్రతిబింబించే సంగీతాన్ని ప్రయాణికులకు వినిపిస్తుంటాయని భారతీయ ఎయిర్​లైన్లు, విమానాశ్రయాలు కూడా అదే పాటించాలని అన్నారు.

భారత సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్) ఇచ్చిన మెమోరాండం ఆధారంగా ఈ సిఫార్సులు చేశారు. వీటిని పాటించాలని డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్​, ఏఏఐ ఛైర్మన్ సంజీవ్ కుమార్​లకు.. పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధి లేఖ రాశారు. ఎయిర్​లైన్లు ఈ సిఫార్సులను అమలు చేస్తే.. భారతీయ సంగీతం మరింత బలోపేతం అవుతుందని సింధియా అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి