
662views
ట్రేసీ నగరం: అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రం ట్రేసీ నగరంలో హిందూ స్వయం సేవక్ సంఘ(హెచ్.ఎస్.ఎస్) కార్యాలయంలో ఈ రోజు యువ శిక్ష వర్గ సమారోప్ కార్యక్రమం నిర్వహించారు. 32 మంది యువతులు, 24 మంది యువకులతో శిక్ష వర్గ జరిగింది. చిన్న కొండపై ఉన్న కార్యాలయం మొత్తం 26 ఎకరాలల్లో ఉన్నది. శిక్షా వర్గ లో కుమారి కృపా అనే అమ్మాయి ప్రచారక్‌గా వచ్చింది. అమెరికా దేశంలో పుట్టి పెరిగి, చదువు పూర్తి చేసి పూర్తి సమయ ప్రచారక్‌గా రావటం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అమెరికా నార్త్ వెస్ట్ ప్రాంత ప్రచారక్ శ్రీమాన్ దిగంత్ గారి మార్గదర్శనంలో ఈ శిక్షణ వర్గ జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) విదేశాలలో హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరుతో హిందూ జాగృతి కోసం పనిచేస్తున్నది.





