
489views
నంద్యాల: చలి తీవ్రత దృష్ట్యా అడవి బిడ్డలైన చెంచులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమం వల్ల కొత్తపల్లె మండలంలోని జానాల గూడెం, బలపాల తిప్ప, పాత మాడుగుల, ఎర్ర మఠం చెంచు గూడెంలలోని చెంచులకు లబ్ధి చేకూరింది. 40 చెంచు గూడేలకు ఈ సేవా సమితి దత్తత తీసుకుంది.

సంఘమిత్ర సేవా సమితి కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్, విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ రామ్ ప్రసాద్ , నంద్యాల జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ చంద్రశేఖర్, కొత్తపల్లి మండల ప్రముఖ్ రాజగోపాల్ రెడ్డి, పాత మాడుగుల పీ.ఎన్.ఆర్, భక్త కన్నప్ప గురుకులం ఆవాస ప్రముఖ్ రామకృష్ణ , స్థానిక చెంచు సోదరులు తదితరులు పాల్గొన్నారు.





