
అమృత్‌సర్: హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. కొందరు దుండగులు పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అజ్నాలాలోని ఆలయంలో విగ్రహాలను కావాలనే కూల్చి వేశారు. అంతేకాకుండా ఆలయంలో దొంగతనం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆలయంలో ఉంచిన బంగారం, అలంకార ఆభరణాలు, బైక్‌లు, కొంత నగదు కూడా దోచుకెళ్లారు. ఆలయ పూజారి స్వామి సత్య ఆకాష్ ఈ ఘటనను ధ్రువీకరించారు. రాత్రి తన గదికి బయటి నుంచి తాళం వేసి ఉందని చెప్పాడు. తెల్లవారుజామున అయిదు గంటలకు నిద్రలేచిన అతను ఇరుగుపొరుగు వారి సహాయంతో తన గదిని తెరిపించుకున్నాడు. ఆ తర్వాత వాళ్లు వెళ్లి ఘటన గురించి తెలుసుకున్నారు.
పూజారి మీడియాతో మాట్లాడుతూ వస్తువులను దోచుకోవడమే కాకుండా, రెండు విగ్రహాలను కూడా కూల్చివేశారు. ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు ఇనుప గొలుసు, రెండు తాళాలు పగులగొట్టారు. ఆలయం లోపలికి వచ్చిన తర్వాత పవిత్ర స్థలం అద్దాలను పగలగొట్టారు. ఆ తర్వాత వారంతా మొదటి అంతస్తుకు వెళ్లారని తెలుస్తోంది. స్వామి ఆకాష్ ఆ ఆలయంలో 15 ఏళ్లుగా అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఇది ఆలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిపిన కుట్రగా అభివర్ణించారు.
Source: NationalistHub





