
ఢాకా: దక్షిణ బంగ్లాదేశ్‌లో ఓ ఓడలో మంటలు చెలరేగడంతో కనీసం 32 మంది మరణించారని పోలీసులు తెలిపారు. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ గ్రామీణ పట్టణం ఝలోకతి సమీపంలో శుక్రవారం ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది. ఓడలో దాదాపు 500 మంది ఉన్నారు. “మూడు అంతస్తుల ఓడలో నది మధ్యలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. ఇప్పటికి 32 మృతదేహాలను వెలికితీశాము. మృతుల సంఖ్య పెరగవచ్చు. చాలా మంది అగ్నిప్రమాదంతో మరణించగా మరికొంత మంది నదిలోకి దూకి మునిగిపోయారు,” అని స్థానిక పోలీసు చీఫ్ మొయినుల్ ఇస్లాం ఏఎఫ్‌పీకి చెప్పారు.
ఢాకా నుంచి తిరిగివస్తున్న వారితో ఉన్న ఓడలోని ఇంజన్ గదిలో మంటలు పుట్టాయని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సుమారు 100 మందిని కాలిన గాయాలతో బారిసాల్‌లోని ఆసుపత్రులకు పంపామని అధికారులు తెలిపారు. నదులను దాటే సమయంలో ఇలాంటి ఓడలను ప్రజలు వినియోగిస్తూ ఉంటారు.. అయితే, ఎటువంటి రక్షణపరమైన చర్యలను కూడా తీసుకోకపోవడంతో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. 170 మిలియన్ల జనాభా ఉన్న దేశంలోని పేలవమైన నిర్వహణ, షిప్‌యార్డ్‌ల వద్ద భద్రతా ప్రమాణాలు ఘోరంగా ఉండడం, షిప్ యార్డుల వద్ద జనం ఎక్కువగా ఉండడంతో ఇలాంటి దుర్ఘటనలకు కారణం అవుతున్నాయని నిపుణులు వెల్లడించారు.
Source: NationalistHub





