News

కొబ్బరి మద్దతు ధర ప్రకటన

545views
  • రైతుకు కేంద్రం అండ‌

న్యూఢిల్లీ: కురిడీ, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

కొబ్బరి కురిడీకి క్వింటాల్‌కు 10, 590 రూపాయలుగా, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు క్వింటాల్‌కు 11 వేల రూపాయల చొప్పున మద్దతు ధరలు ప్రకటించారు. 2022 సంవత్సరానికి ఈ కనీస మద్దతు ధరలు వర్తిస్తాయని చెప్పారు. కొబ్బరి కురిడీ కనీస మద్దతు ధరలకన్నా 58 శాతం, కొబ్బరి చిప్పల కనీస మద్దతు ధరలకన్నా 52 శాతం అధికంగా పెంచినట్టు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి