
403views
-
కార్పొరేటర్లకు సూచించిన మోడీ
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఉత్తమ అయిదు కంపెనీల్లో భారత్‌కు చోటుండేలా సమష్టిగా కృషి చేద్దామని కార్పొరేటర్లకు మోడీ సూచించారు. నిబంధనల భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని, ఏవేవి పరిహరించవచ్చో తెలపాలన్నారు. ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా సోమవారం ప్రధాని కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశమయ్యారు.
ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఊతమిచ్చే చర్యలకు కట్టుబడి ఉన్నామని చెబుతూ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని వారికి వివరించారు. వ్యవసాయం, ఆహార శుద్ధి లాంటి రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు.





