
620views
-
బీహార్‌లో భారీ కుంభకోణం బట్టబయలు
బీహార్: బీహార్‌లో విచిత్రమైన రైల్వే కుంభకోణం బట్టబయలైంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇంజనీర్.. నకిలీ పత్రాలను సృష్టించి ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు. ఇప్పుడిది రైల్వే శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. బీహార్‌లోని సమస్తీపూర్ రైల్వే డివిజన్‌లో ఓ పాత ఆవిరి రైల్ ఇంజిన్ ఉంది. ఇదే డివిజన్‌లో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజీవ్ రంజన్ ఝా దానిపై కన్నేశాడు.
నకిలీ ధ్రువపత్రాలు వినియోగించి దానిని స్క్రాప్ మాఫియాకు అమ్మేశాడు. ఈ వ్యవహారంలో రాజీవ్‌కు స్థానిక పోలీసు అధికారితో పాటు రైల్వే శాఖలోని ఇతర సిబ్బంది కూడా సహకారం అందించినట్టు సమాచారం. ఈ వ్యవహారం డిసెంబర్ 14న చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
Source: Tv9





