News

జమ్మూలో విద్యుత్ సిబ్బంది సమ్మె

353views
  • సైన్యం సాయం కోరిన అధికార యంత్రాంగం

జ‌మ్మూ: జమ్ముకశ్మీర్​లో విద్యుత్​ సిబ్బంది సమ్మె సైరన్​ మోగించారు. ఫలితంగా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. సుమారు 50 శాతానికి పైగా జమ్ము కశ్మీర్​ అంధకారంలో ఉండిపోయింది. దీంతో అత్యవసర సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు స్థానిక అధికార యంత్రాంగం సైన్యం సాయం కోరింది. ఉద్యోగుల సమ్మె కారణంగా జమ్ము ప్రాంతంలో విద్యుత్​ సేవలపై తీవ్ర ప్రభావం పడిందని, ఆర్మీలోని జమ్ము డివిజన్​ కమిషనర్​ రాఘవ్​ లాంఘర్​ తెలిపారు.

ఈ కారణంగా ప్రధాన విద్యుత్ స్టేషన్లలో, నీటి సరఫరాకు సరిపడా సిబ్బంది లేరు. దీంతో అవసరమైన సేవలను పునరుద్ధరించడానికి సైన్యం సాయం చేయాల్సిందిగా కోరుతున్నాని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్మీ అధికారులు నీటి సరఫరా, విద్యుత్​ స్టేషన్​లలో షిప్ట్​ల ప్రకారం సేవలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు బలగాలు రంగంలోకి దిగినట్టు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి