
-
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
భాగ్యనగరం: ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీకరించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో మంచి వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని (ఐఏఎంసీ) జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించారు.
ప్రాంగణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. అనంతరం ఐఏఎంసీలో వసతులను పరిశీలించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీని ప్రారంభించి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.
దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్‌లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.
ఫొనిక్స్ వీకే టవర్‌లో 25వేల చదరపు అడుగుల్లో ఈ కేంద్రం ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ ఐఏఎంసీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు జడ్జిలు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





