News

అణ్వాయుధ రంగంలో భార‌త్‌కు మరో విజయం

546views
  • అగ్ని ప్రైమ్ సక్సెస్

భువ‌నేశ్వ‌ర్‌: భారత్ ఈరోజు ఒడిశాలోని బాలాసోర్ తీరంలో అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం గల అగ్ని సిరీస్ క్షిపణుల అధునాతన వెర్షన్. ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి 1000 నుండి 2000 కి.మీ. రేంజ్‌లోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) రూపొందించి, అభివృద్ధి చేసింది.

అగ్ని-పీ మిస్సైల్ కొత్త జ‌న‌రేష‌న్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ వేరియంట్. అగ్ని ప్రైమ్ క్యానిస్ట‌ర్ మిస్సైల్‌. ఈ మిస్సైల్‌లో అనేక కొత్త ఫీచ‌ర్ల‌ను జోడించారు. అత్యంత కచ్చితత్వంతో మిష‌న్ ల‌క్ష్యాల‌ను చేరుకున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఉద‌యం 11.06 నిమిషాల‌కు డీఆర్డీవో ఈ ప‌రీక్ష చేప‌ట్టింది. అగ్రి ప్రైమ్ క్షిప‌ణి ప‌రీక్ష స‌మ‌యంలో టెలిమెట్రీ, రేడార్‌, ఎల‌క్ట్రో ఆప్టిక‌ల్ స్టేష‌న్స్‌, డౌన్‌రేంజ్ షిప్స్‌ను తూర్ప తీరం వ‌ద్ద ట్రాక్ చేశారు.

అనుకున్న‌ట్టే క్షిప‌ణి ట్రాజెక్ట‌రీ సాగింద‌ని డీఆర్డీవో చెప్పింది. హై లెవ‌ల్ అక్యురెసితో అన్ని అబ్జెక్టివ్‌లను అందుకున్న‌ట్టు డీఆర్డీవో వెల్ల‌డించింది. విజ‌య‌వ‌తంగా అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను ప‌రీక్షించినందుకు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. క్షిప‌ణి అద్భుత‌మైన రీతిలో ప‌నిచేసినందుకు ఆయ‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. మిస్సైల్ ప‌రీక్షలో పాల్గొన్న బృందానికి డీఆర్డీవో చైర్మెన్ డాక్ట‌ర్ జీ స‌తీశ్ రెడ్డి ప్ర‌శంస‌లు తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి