
-
బడ్జెట్ నేపథ్యంలో కీలక భేటీ, సూచనలు, సలహాలు విన్న ప్రధాని
న్యూఢిల్లీ: 2022-23 బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న ముందస్తు చర్చల్లో ప్రధాని మోదీ అగ్రశ్రేణి పెట్టుబడిదార్లతో భేటీ అయ్యారు. దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానం కావాలంటే ఏం చేయాలో సలహాలు, సూచనలు స్వీకరించారు. సులభతర వ్యాపార నిర్వహణ, అధిక మూలధనాన్ని ఆకర్షించడం, సంస్కరణల ప్రక్రియ వంటి వాటిపైనే చర్చ సాగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
సిఖోయా క్యాపిటల్ నుంచి రాజన్ ఆనందన్, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి విపుల్ రూంగ్టా, ఇండియా రిసర్జంట్ నుంచి శాంతను నలవాడి, బ్లాక్‌స్టోన్ నుంచి అమిత్ దాల్మియా, టీవీఎస్ క్యాపిటల్స్ నుంచి గోపాల్ శ్రీనివాసన్, మల్టిపుల్స్ నుంచి రేణుకా రామనాథ్, కేదారా క్యాపిటల్ నుంచి మనీశ్ కేజ్రీవాల్, క్రిస్ నుంచి అష్లే మెనెజెస్, ఆవిష్కార్ నుంచి వినీత్ రాయ్ అడ్వెంట్ నుంచి శ్వేతా జలాన్, బ్రూక్‌ఫీల్డ్ నుంచి అంకుర్ గుప్తా, ఎలెవేషన్ నుంచి ముకుల్ అరోరా, ప్రాసస్ నుంచి సెహ్‌రాజ్ సింగ్, గజా క్యాపిటల్ నుంచి రంజిత్ షా, యర్నెస్ట్ నుంచి సునీల్ గోయల్, ఎన్‌ఐఐఎఫ్ నుంచి పద్మనాభ సింహా ప్రధాని మోదీతో భేటీ అయిన వారిలో ఉన్నారు. పీఎంఓ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.





