
463views
న్యూఢిల్లీ: నవజాత శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టు ఉడాయ్ సీఈఓ సౌరభ్ గార్గ్ వెల్లడించారు. ఇందుకోసం రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం ద్వారా నకిలీ లబ్ధిదారుల కట్టడి సాధ్యమవుతోందని, దీంతో దేశ ఖజానాకు రూ.2.25 లక్షల కోట్లు ఆదా అయిందని సౌరభ్ గార్గ్ పేర్కొన్నారు.
కేంద్రానికి సంబంధించిన 300, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 400 పథకాలు ఆధార్‌తో అనుసంధానమైనట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీల(డీబీటీ) ద్వారా కేంద్రం రూ.2.25 లక్షల కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు.





