News

సంస్కరణలు కొనసాగించాలని పరిశ్రమల ప్రతినిధుల విజ్ఞప్తి

409views

న్యూఢిల్లీ: కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు వచ్చే బడ్జెట్‌లో పన్ను, విధాన స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ, సంస్కరణలను కొనసాగించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పరిశ్రమ ప్రతినిధులు కోరారు. బడ్జెట్‌ ముందస్తు చర్చల్లో భాగంగా దృశ్య మాధ్యమ కార్యక్రమంలో పరిశ్రమ సంఘాల ప్రతినిధులు మంత్రికి పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రైవేటు పెట్టుబడుల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పునరుద్ధరణ సంకేతాలను దృఢంగా ఉంచడంలో ప్రభుత్వ చర్యలు తోడ్పాటు అందిస్తాయని వారు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి