News

చీఫ్ ఆఫ్‌ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా జనరల్ నరవాణే

460views

న్యూఢిల్లీ: భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం, ప్రస్తుతానికి పాత విధానమే అమలు చేస్తున్నారు. వెంటనే మరొకరిని సిడిఎస్ గా నియమించకుండా, ముగ్గురు సర్వీస్ చీఫ్‌లలో అత్యంత సీనియర్లు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.

భారతీయ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అత్యంత సీనియర్ కావడంతో సిడిఎస్ వ్యవస్థ ఉనికిలోకి రాకముందు ఉన్న పద్ధతి ప్రకారం చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కొత్త సిడిఎస్‌ను నియమించే వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి