
756views
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీపై స్పష్టత ఇవ్వాలని కోల్ కతా హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. చంద్రబోస్ మరణించారా? లేక ఇంకా జీవిస్తున్నారా? అన్న విషయాన్ని రెండు నెలల్లోగా చెప్పాలంది. కాగా నేతాజీ మరణించారా? లేదా? అన్న విషయం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. ఆయన మరణంపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. 1945 ఆగస్టు 18న జపాన్ లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారని కొందరు భావిస్తున్నారు.





