News

జమ్మూ కాశ్మీర్ : ఎన్కౌంటర్ లో ఉగ్రవాది హతం

496views

మ్ముకశ్మీర్ అవంతిపొరాలోని బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమైనట్లు అధికారులు తెలిపారు. బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా.. ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఉగ్ర వేట కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.